అందోల్ లో విద్యా ప్రగతికి పెద్దపీట దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బంది భాగస్వామ్యం చేయాలి
అందోల్,చౌట్కూర్ మండలాలలోరూ.31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి దామోదర్
సంగారెడ్డి సెప్టెంబర్ 04 నమస్తే ఇందూర్ :- అందోల్ నియోజకవర్గం లో విద్యా ప్రగతి పెద్ద పీఠ వేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్, చౌటకూర్ మండలాల లోని పలు అభివృద్ధి , సంక్షేమ , ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ. 31.24 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడారు రాష్ట్రంలో అందోల్ నియోజకవర్గాన్ని విజ్ఞాన భాండాగారం గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల విద్యాసంస్థలు రానున్న మూడు సంవత్సరాల్లో దశల వారీగా పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు.విద్యాసంస్థల లో కావలసిన మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తున్నామన్నారు. గురువారం అందోల్, చౌటకూర్ మండలాలలో రూ. 31.24 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ లో కోట్లతో నిర్మించనున్న కేజీబీవీ పాఠశాల భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం సుల్తాన్పూర్ లో రూ .2.56కోట్ల తో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అందుల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ రెండు కోట్లతో నిర్మించనున్న స్వాగత తోరణం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అందంలోని మహిళా నర్సింగ్ కళాశాల మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేజీబీవీ విద్యాసంస్థల వద్ద లక్షలతో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. అందోల్ కేజీబీవీ రూ.2.20 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పేరెంట్స్ వెయిటింగ్ హాల్ టాయిలెట్ బ్లాక్ లను మంత్రి ప్రారంభించారు. ఆందోల్ లో రూ.5.75 కొట్టతో నిర్మించనున్న రెవెన్యూ డివిజనల్ నూతన కార్యాలయ నిర్మాణం పనులకు శంకు మంత్రి శంకుస్థాపన చేశారు . ప్రభుత్వ విద్యాసంస్థలు శానిటేషన్ కార్యక్రమాలలో మున్సిపల్ సిబ్బంది సహకారం తీసుకొని విద్యాసంస్థల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సిబ్బందికి మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇళ్లను మంత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు గౌరవప్రదమైన వసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సొంత ఇంటి కలలు నెరవేర్చేలా ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు.కొత్త మోడల్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ, లబ్ధిదారుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలతో కూడిన గృహాలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్ డి ఓ పాండు స్థానిక ప్రజాప్రతినిధులు, పిసిసి ఉపాధ్యక్షులు మరెల్లి సంగమేశ్వర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య సురేందర్ గౌడ్, ప్రదీప్ గౌడ్ పద్మనాభరెడ్డి పెద్దపట్ల వినయ్ గౌడ్ మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచులు , మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.





