గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే జారే కు పట్టభద్రులు వినతిపత్రం
నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 29
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే సంభందిత అధికారులకు పరిశీలించవల్సిందిగా ఆదేశాలు
దమ్మపేట మండలం, గండుగులపల్లిలో గల అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ క్యాంపు కార్యాలయంలో బుధవారం దమ్మపేట గ్రామ పట్ట భద్రులు కలిసి దమ్మపేటలో గల ప్రధాన సమస్యలు జనరల్ జూనియర్ కాలేజీ, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంభందించిన కాలేజీల ఏర్పాటు. డ్రైనేజ్ లో మురుగు పోక నిల్వ ఉండి దుర్వాసన మరియు దోమల వృద్ధి నివారణకు చర్యలు చేపట్టడం. నూతన గ్రంధాలయంకు స్థలం కేటాయించారు అని తెలిసింది కావున ఆ గ్రంధాలయంకు ఆధునిక టెక్నాలజీ వసతులతో మరియు పోటీ పరీక్షలకు సైతం దీటుగా ఏర్పాటుచేసి, నిర్వహణలో గ్రామ పట్టభద్రుల భాగస్వామ్యం ఉండేటట్లు చేయుట గురించి. రద్దీ ప్రాంతంలో రోడ్ల పై వ్యాపారుల ఆక్రమణ తొలగించుట గురించి. హిందూ స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించే దగ్గర చుట్టూ కాంక్రీట్ ఫ్లోర్ నిర్మాణం మరియు స్మశానంకు పూర్తి స్ధాయిలో ప్రహరీ నిర్మాణం. డ్రైనేజ్ పై ఫుట్ పాత్ నిర్మాణం మరియు రామాంజనేయ కుంట చుట్టూ వాకింగ్ చేసే ఏర్పాటు చేయుట గురించి. గ్రౌండ్ లేక యువత, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున గ్రౌండ్ ఏర్పాటు. వెజ్ మార్కెట్ ను ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన గల దమ్మపేట గ్రామ పంచాయితీ స్థలము లో ఏర్పాటు చేయాలి. మాంసం దుఖాణాలను ఊరు బయట స్థల సేకరణ చేసి ఏర్పాటు చేయుట గురించి. దమ్మపేట బస్టాండు ఆధునీకరణకు నిధులు విడుదల అయినవి అని తెలిసింది. కావున బస్టాండ్ ఆధునీకరణ చేసి సత్తుపల్లి నుండి మందలపల్లి మీదగా అశ్వారావుపేటకి వచ్చే మరియు వెళ్ళే బస్సులను దమ్మపేట బస్టాండ్ మీదగా వచ్చే ఏర్పాటు. నిరుపయోగంగా ఉన్న షాదీఖానాను ఉపయోగంలోకి తీసుకురావడం పై దృష్టిసారించి పరిష్కరించాలి అని వినతిపత్రం
ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే సంబంధిత ప్రతి శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి చేయవలసిన పనుల పై దిశా నిర్దేశం చేశారు. దమ్మపేట పట్ట భద్రులు అయిన ఆంగోతు బాలాజీ, గట్ల నాగరాజు, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, వనమా శ్రీనివాసరావు, పానుగంటి వేణు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు పట్టభద్రుల తరపున వినతిపత్రం ఇచ్చినవారిలో ఉన్నారు.

