చేపల విక్రయ వాహనం అందజేత
జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 6 నమస్తే ఇందూర్
నిజాం సాగర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ సంచార చేపల విక్రయ వాహనం ఇందిరా మహిళ శక్తి పథకం కింద మంజూరు అయింది. రాష్ట్ర మత్స్యశాఖ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శనివారం లబ్ధిదారురాలికి అందజేశారు.. మహిళలు వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు.
అనంతరం నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే శ్రీకాంత్ గారి తల్లి ఏలే భూమమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి వెళ్లి వారికి పరామర్శించారు.. వారితో పాటు స్థానిక నాయకులు మండలలా అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.




