నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ రాయల పోలయ్య
మెంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వరావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపోయే ప్రాంతాలను డి డి ఆర్ ఎఫ్ సిబ్బందితో అశ్వరావుపేట సిఐ పి నాగరాజు , ఎస్సై టి యయాతి రాజు మరియు సిబ్బంది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మరియు ఎటువంటి అవసరమైన వెంటనే పోలీసు ల కు సమాచారం అందించవలసిందిగా సూచించారు.

