ఆడవారిని నమ్మించి దొంగతనానికి పాల్పడిన నిందితుడు
సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 11 నమస్తే ఇందూర్ ప్రతినిధి సత్యం రిపోర్టర్ 
పుల్కల్ మండలంలోని గొంగుళూర్ తేది. 10 వ తేదీన మ: 12.30 గంటలకు పిర్యాదిరాలు మంగలి సతమ్మ భగసింగ్ నగర్ సంగారెడ్డి తన చెల్లెలు రుక్కమ్మ వద్దకు పోవుచుండగా నేరస్థుడు రమావత్ బన్సిలాల్ ఆమె వద్ద ఉన్న వస్తువులు దొంగలించాలని అనుకొని అటువైపే పోతున్నాను మీ చెల్లెలు దగ్గర దించుతాను అని నమ్మబలికి బైకు మీద ఎక్కించుకొని సంగారెడ్డి నుండి తాడ్దాన్ పల్లి టోల్ గేటు వద్ద నుండి సింగూర్ వైపు పోవుచూ గొంగులూరు గ్రామ శివారులోని మైసమ్మ గుడి వద్దకు రాగానే మధ్యాహ్నం అందాజ 2 గంటల సమయమున అక్కడ ఎవ్వరూ కనిపించక పోవడముతో ఆమెను చంపుతానని బెదిరించి బలవంతముగా ఆమె వెండి కాళ్ళ కడియాలు కుడి చెవి బంగారు కమ్మ మాటీతో గలది గుంజుకున్నాడు. ఆమె చెవి తెగి రక్త గాయము అయినది. ఇట్టి కేసులో పిర్యాది ధరఖాస్తు ఇవ్వగా పుల్కల్ పోలీస్ స్టేషనులో నేరము Cr. No. 149/2025 U/s 309(6) BNS ప్రకారము కేసు అయినది దర్యాప్తులో భాగముగా తేది:11.10.2025 నాడు నేరస్తుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా ఇతను జల్సాలు తీర్చుకోవటానికి దొంగతనాలు చేసేవాడు. తేది: 10.10.2025 నాడు పల్సర్ బైకు మీద సంగారెడ్డికి కూలి పనుల గురించి అడ్డ మీదికి పోయి పిర్యాది రాలు మంగలి సత్యమ్మ, తన చెల్లెలు రుక్కమ్మ వద్దకు సదాశివపేట పోవుచుండగా ఆమె వద్ద ఉన్న వస్తువులు దొంగలించాలని అనుకొని అటువైపే పోతున్నానని మీ చెల్లెలు దగ్గర దించుతానని నమ్మబలికి ఆమెను బైకు మీద ఎక్కించుకొని గొంగులూరు గ్రామ శివారులోకి మైసమ్మ గుడి సమీపములో మధ్యాహ్నం 2 గంటలపుడు ఆమెను చంపుతానని బెదిరించి బలవంతముగా ఆమె వెండి కాళ్ళ కడియాలు కుడి చెవి బంగారు కమ్మ మాటీతో ఉన్నది గుంజుకున్నాడు. ఆమె ఆమె చెవి తెగి రక్త గాయము అయ్యి కేకలు వెయ్యగా అటుగా వస్తున్న ఒక వ్యక్తిని చూసి పారిపోయినట్లు ఒప్పుకున్నాడు. ఇతని వద్ద నుండి పంచుల సమక్షములో ఇట్టి కేసులో నేరస్థుడు దొంగలించిన బంగారు మరియు వెండి వస్తువులు నేరస్థుని బైకు, ఫోను స్వాదీన పరుచుకున్నాము. ఇతనిపై మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకు దొంగతనము కేసు, నర్సాపూర్ పోలీస్ స్టేషనులో ఒక రేప్ మరియు దొంగతనము కేసు, మరియు పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య, దోపిడి కేసు మొత్తము (3) కేసులు ఉన్నట్లు తెలిపినారు. ఈరోజు నేరస్థుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు జోగిపేట్ సిఐ డి.అనిల్ కుమార్ తెలిపినారు.



