పటాన్చెరు జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 3/ ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నాగరాజు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శనివారం సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెర్ ,జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య , వైద్యులతో కలిసి ఆస్పత్రిలోని వార్డులన్నీ కలియతిరిగారు. ఆస్పత్రిలో రోగులతో నేరుగా ముచ్చటించారు. ఇక్కడ అందుతున్న వైద్య తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురమ్మని ఆయన కోరగా ఎలాంటి సమస్యలు లేవని పేషెంట్లు వెల్లడించినట్లు వైద్యులు తెలిపారు.





