బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ సమావేశ
జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, న్యూస్ తెలుగు దినపత్రిక, 03 జనవరి,
బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా శనివారం రోజున బిచ్కుంద బిజెపి పార్టీ కార్యాలయంలో
బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు ఆధ్వర్యంలో
మున్సిపాలిటీ బిజెపి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలో బిజెపి పార్టీకి ఎంతో కీలకమని,
ప్రతి వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లి,
బిజెపి పార్టీనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేయాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లోనుకాకుండా
పార్టీ శ్రేణులు ఐక్యంగా, క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేస్తే
బిచ్కుంద మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాముసెట్, మండల జనరల్ సెక్రెటరీలు జాదోవ్ పండరి, పిరాజి బిచ్కుంద పట్టణ పలువురు సీనియర్ నాయకులు, మున్సిపాలిటీ స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు





