వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మర్రి మొక్క నాటిన వనప్రేమికుడు సమ్మయ్య
నమస్తే ఇందూర్: నెక్కొండ
జాతీయ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నెక్కొండ మండల కేంద్రంలోని మర్రికొమ్మ వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్, జీవ వైవిధ్య అవార్డు గ్రహీత వనప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మర్రి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనిషి మనుషులను ప్రేమించడం మానవత్వం, వన్యప్రాణులను ప్రేమించడం దైవత్వం. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, చెట్లను సంరక్షించాలి” అని పిలుపునిచ్చారు. తాను నాటిన మొక్కలు చెట్లుగా పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నాటి మొక్కలు, నేటి మొక్కలన్నీ వటవృక్షాలుగా పెరిగి మానవాళి, వన్యప్రాణి జీవకోటికి ఆవాసం కల్పించాలని భగవంతుని ప్రార్థించారు.





