నాలుగు కోట్లు విలువైన భవంతిని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి విరాళ
నమస్తే ఇందూర్: హైదరాబాద్, సెప్టెంబర్ 4:
హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన ఇంటిని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. గురువారం చిక్కడపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈవో వెంకట్రావు సమక్షంలో దేవుడి పేరుతో ఆస్తి రిజిస్ట్రేషన్ చేశారు. 152 గజాల విస్తీర్ణంలో నిర్మించిన జీ+3 భవనం, పెంట్‌హౌస్‌ను సహా స్వామివారికి సమర్పించారు. తరువాత ఈవో వెంకట్రావు, దేవస్థాన చైర్మన్ నరసింహమూర్తి, ఇతర అధికారులు దాతను సన్మానించారు. స్వామివారి ప్రసాదం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్స్‌పాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా అభినందించారు.


