అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటు
చైర్మన్గా ఎస్ కిష్టారెడ్డి
వైస్ చైర్మన్గా ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)
నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.
ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి
సంగారెడ్డి జిల్లా / నమస్తే ఇందుర్ / ఫిబ్రవరి 16/ ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి నాగరాజు 
అందోల్ జోగిపేట మున్సిపాలిటీ నూతన చైర్మన్గా ఎస్ కిష్టారెడ్డి, వైస్ చైర్మన్గా ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు ఎన్నికయ్యారు. సోమవారం అందోల్ జోగిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మొత్తం 20 మంది వార్డ్ కౌన్సిలర్ సభ్యులకు 16 మంది కాంగ్రెస్ ఒకరు కాంగ్రెస్ రెబల్ మూడు బి ఆర్ ఎస్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అందరు కౌన్సిలర్ల సమన్వయంతో ఎన్నుకోవడం జరిగింది . ఈ సందర్భంగా ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుండి నడిపిస్తానని ప్రతి వార్డు కు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చైర్మన్ కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు



