అత్తింటి వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్
సంగారెడ్డి నవంబర్ 16 నమస్తే హిందూర్ అందోల్ కాంసెన్సీ ప్రతినిధి సత్యం రిపోర్టర్
అందోల్ కాంసెన్సీ పుల్కల్ మండలం లోని పెద్దరెడ్డిపేట గ్రామంలో అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న సంఘటన ఘటన పుల్కల్ పోలిస్ స్టేష న్ పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్ఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని బిజిలిపూర్ గ్రామా నికి చెందిన లక్ష్మి (26) ని 20 నెలల క్రితం పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన పట్నం ప్రవీణితో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 9 లక్షల నగదు, బంగారం, ఇతర సామాగ్రి వర కట్నంగా అందజేశారు. వీరి కాపురం 4 నెలల పాటు సాఫీగా
సాగింది. ఆ తర్వాత నుండి అదన పు కట్నం తీసుకురావలని, భర్తతో పాటు అత్తమామలు లక్ష్మిని శారీర కంగా, మానసీకంగా వేదిండం మొదలు పెట్టారు. నాలుగు నెలలపా టు సర్దుకు పోయిన వారిలో ఏలాంటి మార్పు రాలేదు. వేధింపులు తీ వ్రం కావడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడి నుండి తీసుకువేళ్ళా లని చెప్పడంతో తల్లి అంబమ్మ వచ్చి పుట్టింటికి తీసుకువెళ్ళింది. 3నె లల తర్వాత భర్త ప్రవీణ్ గ్రామ పెద్దల సమక్షంలో ఇప్పటి నుంచి బాగ చూసుకుంటానని చెప్పి కాపురానికి తీసుకువచ్చాడు. నెల వరకు సంసారం బాగానే కొనసాగింది. మళ్ళీ శనివా రం భర్త, అత్తమామలు ముగ్గురు కలిసి శారీ రకంగా వేదించి చిత్రహింసలకు గురి చేయ డంతో మనస్థపానికి గురై ఇంట్లోనే గదిలో దూలానికి ఉరి వేసుకుంది. ఇది గమనించి న భర్త ప్రవీణ్ స్థానికుల సహయంతో సంగా రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డా క్టర్లు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి 10 నెలల పాప ఉంది. మృతురాలి తల్లి అంబమ్మ పిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుల్కల్ ఏఏసై వెంకటేశం తెలిపారు.



