ఇనుగాల పుట్టినరోజు సందర్భంగా రోగులకు దుప్పట్ల పంపిణీ
నమస్తే ఇందూర్: వరంగల్, సెప్టెంబర్ 6
వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమేట్ ఆధ్వర్యంలో రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గొర్రకుంట క్రాస్ వద్ద ఉన్న ఈఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో క్లైమేట్ స్వయంగా పాల్గొని రోగులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి కారణం ఇనుగాల వెంకటరామిరెడ్డి. ఎలాంటి కష్టసమయంలోనైనా పార్టీ కోసం ధైర్యంగా నిలిచిన అరుదైన నాయకుడు ఇనుగాల. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరెన్నో సేవలు అందించాలి” అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గొర్రెకుంట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ల్యాధళ్ళ సంపత్, 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఏలగొండ ప్రవీణ్, కట్ట మల్లన్న దేవస్థానం చైర్మన్ గాజు శీను, దేవస్థాన సభ్యుడు కట్కూరు సారయ్య, 16వ డివిజన్ అధ్యక్షుడు ధూపాకి సంతోష్, గరీబ్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసారపు సారయ్య, వల్లెం సుధాకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆఫ్రిన్ జానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బందెల ప్రవీణ్, ఇసం పెళ్లి సాంబయ్య, జన్ను గోవిందు తదితరులు పాల్గొన్నారు.





