కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మహమ్మద్ అలీ షబ్బీర్
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 08:
కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. హౌసింగ్ బోర్డ్, జి వి ఆర్ కాలనీలో నీరు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని నాయకులు మున్సిపల్ ఎన్నికలు రాగానే రావడంపై ప్రతిపక్షాలను విమర్శించారు.8వ వార్డు అభివృద్ధి కావాలంటే గంప ప్రసాద్ ను గెలిపించాలను,8 వ వార్డు ప్రజల కోరిక మేరకు రేషన్ షాప్ ఏర్పాటు చేస్తానని సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గంప ప్రసాద్ తో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి లో వరదలు వచ్చిన సమయంలో రానీ నాయకులు ఎన్నికలు రాగానే రావడం ఏంటని ప్రతిపక్షాలను విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని గుర్తు చేశారు,వరద సమస్యల నివారణకు 8 కోట్ల రూపాయలు కేటాయించాను,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో కామారెడ్డి అభివృద్ధికి పాటుపడతానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8 వ వార్డు లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ 8వ వార్డు అభివృద్ధి జరగాలంటే గంప ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.8వ వార్డు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను అమలుపరిచే బాధ్యత నాదని గంప ప్రసాద్ ను గెలిపించే బాధ్యత 8వ వార్డు ప్రజల పైననే ఉందని అన్నారు.
వరదల సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని,నాడు ఎక్కడ కనబడని బిజెపి,టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఓటు వేయమని మీ దగ్గరకు వస్తున్నారని ఏం మొహం పెట్టుకొని ఓటు వేయమని అడుగుతున్నారని అలాంటి వారిని నిలదీయాలని అన్నారు.94 మంది వరద బాధితులకు సహాయాన్ని అందజేయడం జరిగిందని అన్నారు.వార్డు ప్రజల కోరిక మేరకు రేషన్ షాపు దూర ప్రాంతంలో ఉందని ఈ ప్రాంతంలోని రేషన్ షాపును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే సానుకూలంగా స్పందించి ఆ విషయాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది గంప ప్రసాద్ గెలిచిన వెంటనే షాపును జి ఆర్ కాలనీ,కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ మూడు ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చడం జరుగుతుందని అన్నారు.8వ వార్డులో నిధులు కావాలన్నా,అభివృద్ధి జరగాలన్న అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,షబ్బీర్ ఆలీ,కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాలనీ ప్రజలు ఒక అడుగు అభివృద్ధికి ముందుకు వస్తే నాలుగు అడుగులు నడుస్తానని గంప ప్రసాద్ ను గెలిపించి వార్డు అభివృద్ధి పరుచుకోవాలని ప్రజలకు తెలియజేశారు.బిజెపి,టిఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని నిధులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అందులో నుండి 8 వ వార్డు అభివృద్ధి కోసం కావలసిన విధులను విడుదల చేస్తానని కులం పేరుతో,మతం పేరుతో రాజకీయాలు మానుకొని అభివృద్ధికే పట్టం కట్టాలని సూచించారు.యువకుడు సేవా తత్పరుడైన గంప ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి 8వ వార్డును కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో 8వ వార్డు అభ్యర్థి గంప ప్రసాద్, సీనియర్ నాయకులు ఇలియాస్, రాజు, నిట్టు కృష్ణమోహన్, పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




