కుంఫులో విజయం సాధించిన అందోల్ విద్యార్థులు.
హర్షం వ్యక్తం చేసిన మాస్టర్ మురళి
అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కుంఫులో 11 మంది బెల్ట్ సర్టిఫికెట్లను సాధించారు
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 5/ ఆందోల్ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజు
అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కుంఫులో విజయం సాధించారు. వారియర్ మార్చర్ ఆర్ట్స్ వంటి యుద్ధ క్రీడల్లో అమ్మాయిలు రాణించడంలో ఆత్మ స్థైర్యాన్ని తోపాటు జీవితంలో ఉన్నత విజయాలు సాధించాలని ప్రధానోపాధ్యాయులు దేవిదాస్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన మార్చల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా రాష్ట్రస్థాయి బెల్ట్ ఎగ్జామ్ లో అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు బెల్టు సర్టిఫికెట్ సాధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మురళి, పిటి కృష్ణ, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు


