కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
-చెర్మన్ గా మ్యాతరి అశోక్ ప్రమాణ స్వీకారం.
జహీరాబాద్/కోహిర్/ఫిబ్రవరి 16(నమస్తే ఇందూర్ ప్రతినిధి అనిల్ కుమార్):-
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది హోరాహోరిగా సాగిన ఎన్నికల్లో ఏంఐఏం. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. కోహిర్ మున్సిపల్ చైర్మన్ గా యo. అశోక్ వైస్ చైర్మన్ గా మొహమ్మద్ అబ్దుల్ హన్నాన్ జావీద్ ఎన్నికయారు అధికారుల సమక్షంలో వీరిద్దరూ బాధ్యతలు చేపట్టారు. వారితో పాటు కౌన్సిలర్ గ అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేసారు. చైర్మన్ పీఠం దక్కదంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు.ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ బాబా ఫసియేద్దీన్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు. అస్మా జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి కోహీర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంషీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



