గ్రామ సభలో సర్పంచ్ భర్త కృష్ణారెడ్డి హల్చల్
విధులకు డుమ్మా గ్రామ సభకు హాజరు
సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలనీ ప్రజల ఆవేదన
పుల్కల్, ఏప్రిల్ 2 ( పుల్కల్ మండల్ గ్రామం. నమస్తే ఇందూర్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రం తో పాటు పలు గ్రామాలలో అధికారులు గ్రామసభలను నిర్వహించారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా ఆయా గ్రామాల్లో అధికారులు గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించి గ్రామ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.ఇది లా ఉండగా మండల కేంద్రం పుల్కల్ నిర్వహించిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ చిరంజి లావణ్య భర్త కృష్ణారెడ్డి హల్చల్ చేశారు. అధికారులతో సమానంగా స్టేజిపై కూర్చున్నారు. అసలు ఏ హోదా ఉందని సర్పంచ్ భర్త కృష్ణారెడ్డి అక్కడ కూర్చున్నారని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తహసిల్దార్ కృష్ణ అక్కడే ఉన్నాడు.గ్రామసభలో స్టేజిపై ఎవరు ఎక్కడ కూర్చోవాలా కూడా తెలియదా, అధికారిక కార్యక్రమంలో తాహసిల్దార్ పక్కనే సర్పంచ్ భర్త కృష్ణ రెడ్డి కూర్చోవడం ఏమిటని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో కూడా సర్పంచ్ భర్త పెత్తనం ఏంటి అంటూ ప్రజలు గుసగుసలాడారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూనే వారిని చైతన్య పరచడం ఏమిటో కానీ వారి విధుల్లో సైతం వారిని కొనసాగించడం లేదు.ప్రతిసారి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలే రాజ్యమేలుతుండటం గమనహర్వం.హోంగార్డుగా విధులు నిర్వహించే కృష్ణారెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోయారు.