ఘనంగా ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ….
రాబోయే స్థానిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలి…..
ముదిరాజ్ ల ఆత్మగౌరవం దెబ్బతేసేవిధంగా చేస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పక తప్పదు.
నమస్తే ఇందూర్, ములుగు
సోమవారం రోజున ములుగు జిల్లా , ములుగు మండలం , ఇంచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ , ములుగు జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ గారు ముదిరాజ్ మహాసభ జెండాను ముదిరాజ్ నాయకులతో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ , ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో అన్నీ రాజకీయ పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ముదిరాజ్ యువత అన్నీ రంగాల్లో రాణించాలని , ముదిరాజ్ యువతీ , యువకులు రాజకీయాల్లో రావాలని కొనియాడారు. జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో 11% ఉన్నామని అన్నారు. స్థానిక ఎన్నికలలో సముచితం స్థానం కల్పించకపోతే స్వతంత్రంగా నిలబడి గెలిచి చూపిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు సాధు రఘు ముదిరాజ్ , లక్నవరం చైర్మన్ పులుగుర్తీ వెంకన్న ముదిరాజ్ , జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట మల్లన్న ముదిరాజ్ , మాజీ సర్పంచ్ మోరె రాజయ్య , తాడ్వాయి మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రంగారబోయిన జగదీష్ ముదిరాజ్ , మాజీ ఎంపీటీసీ అశోక్ ముదిరాజ్ , మాజీ ప్రజాప్రతినిధులు , ముదిరాజ్ మహిళా నాయకురాలు , ముదిరాజ్ యువతీ , యువకులు , తదితరులు పాల్గొన్నారు.





