పట్టుదలతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన – బెల్లంకొండ నవీన
నమస్తే ఇందూర్ ములుగు జిల్లా
మా కుమార్తె బెల్లంకొండ నవీన వివాహం తర్వాత ఇద్దరు పిల్లలతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, పుస్తకాలతో పోరాడి తన పట్టుదలతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది.ప్రస్తుతం కమర్షియల్ టాక్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Group-II) ఉద్యోగానికి ఎంపిక కావడం మా కుటుంబానికి గర్వకారణం.ఎటువంటి కోచింగ్ లేకుండా, తన భర్త శ్రీ తడక కరుణాకర్ , సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ గారి మార్గదర్శకత్వంలో కష్టపడి ఈ ఘనవిజయాన్ని సాధించింది.తల్లిదండ్రుల కలను నెరవేర్చుతూ, ఆమె సాధన ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుంది.
– బెల్లంకొండ రాజమౌళి, చంద్రకళ




