ప్రభుత్వ సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కలిసిన ట్రస్మా సభ్యులు.
నమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 3 నవంబర్
ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో ట్రస్మా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదర్శ న్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.సన్మానించిన కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ కుమార్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, బోధన్ పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, ఉషోదయ విద్యాసంస్థల అధినేత దుష్యంత్,లయన్స్ ప్రతినిధులు బసవేశ్వర రావు, నరసింహారెడ్డి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.





