భీమారంలో వినాయకుని పూజల్లో ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు
నమస్తే ఇందూర్: హన్మకొండ, సెప్టెంబర్ 4 :
శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమారంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడ్డం శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జి.ఎస్.ఆర్ టీమ్, రేణుక ఎల్లమ్మ తల్లి గజానన యూత్ కమిటీ ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఈ వేడుక జరిగింది. ప్రధాన అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్. దిలీప్ రాజ్ హాజరయ్యారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, “గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంట సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండాలని కోరుకున్నా. ఈ పండుగ భక్తి, శక్తి మాత్రమే కాకుండా ఐకమత్యం, స్నేహభావాన్ని పెంపొందిస్తుంది” అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించడం ఆనందదాయకమని తెలిపారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, గజానన యూత్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.