మాజీ డీఎస్పీ నళినికి న్యాయం కోసం బీజేపీ అండ
నమస్తే ఇందూర్: వరంగల్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రగతి కాలనీలో మాజీ డీఎస్పీ నళిని నివాసానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –
మాజీ డీఎస్పీ నళినికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో “జై తెలంగాణ” అన్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేసిందని, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డీఎస్పీ నళినికి వెంటనే న్యాయం జరగాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తూ, న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.





