వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ
సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /ఫిబ్రవరి 16/అందోల్ నియోజకవర్గం ప్రతినిధి నాగరాజు
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఎ హజ్రత్ సయ్యద్ షా ఖ్వాజా దాస్ ఖాజా షరీఫ్ గారి 40 వ వార్షిక ఆరాధన మహోత్సవం (ఉర్సు ఉత్సవం) లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు.
వట్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఖ్వాజా షరీఫ్ దర్గా ను దర్శించుకున్నారు. షరీఫ్ దర్గా కు చద్దర్ ను సమర్పించారు. దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం, సామూహిక భోజనశాలలో నేలపై కూర్చోని భక్తులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సహపంక్తి భోజనం చేసి తన నిరాడంబరాన్ని చాటారు.ఈ కార్యక్రమం లో వట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ జోషి అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

