*సంగారెడ్డి సెంట్రల్ జైలు (కంది )లో జిల్లా న్యాయ* *సేవాధికార సంస్థ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ*
సంగారెడ్డి, జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 9/కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య కంది లోని సంగారెడ్డి సెంట్రల్ జైలును ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ
నిర్వహించారు.
ఈ సందర్భంగా జైలులోని బెరక్కులు, ఖైదీల గదులు, వంటగది, బాత్రూంలు, నిల్వ గదులు తదితర విభాగాలను పరిశీలించి జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించారు. ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందుతున్నసదుపాయాలు, భోజన నాణ్యత, ఆరోగ్య సౌకర్యాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
అన్ని బెరక్కులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఖైదీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచించారు. అలాగే ఖైదీలకు సమయానికి బెయిల్స్, ములాఖత్ సదుపాయాలు అందుతున్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు.
ఖైదీల కేసుల పరిష్కారానికి ఉచిత న్యాయ సేవలు అందించేందుకు అవసరమైతే లీగల్ ఎయిడ్ ద్వారా ఉచిత న్యాయవాదులను నియమిస్తామని ఖైదీలకు తెలియజేశారు. జైల్లో నిర్వహిస్తున్న లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను కూడా పరిశీలించారు.
ఈ తనిఖీ సందర్భంగా ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి పరిశీలించడంతో పాటు, వాడే కూరగాయలు, బియ్యం, ఇతర సరుకుల నిల్వ గదులను కూడా తనిఖీ చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తో పాటు జైలు సూపరింటెండెంట్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

