సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్ / ఏప్రిల్ 2
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు . వారు తెలంగాణ ప్రాంతంలో అందించిన స్ఫూర్తి , త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా వారు నిర్మించిన కోటలను పర్యాటకంగా, పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు జిల్లా కలెక్టర్ మాధురి, అదన జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.