స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగిన బంజారా ఆడబిడ్డ
దశాబ్ద కాలం నుంచి వార్డు మెంబర్
నమస్తే ఇందూర్, అమ్రాబాద్ మండల రిపోర్టర్ జి.సరిత
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట ( బ్రహ్మగిరి ) గ్రామ పంచాయతీ నుండి మనకు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి ఇప్పటి వరకు అంటే దశాబ్ద కాలం నుంచి వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రామావత్ సుశీల ఈ సారి స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆనుకుంది. కాని తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన BRS పార్టీ మీద ఉన్న అభిమానం తో మరియు కటకం మహేష్ మాజీ ఉప సర్పంచ్ మరియు ఎడ్ల శేఖర్, తిమ్మన్న ( BRS సీనియర్ నాయకులు ) మాట కాదనకుండా మళ్లీ BRS పార్టీ తరుపున 9 వ వార్డు మెంబర్ అభ్యర్థి గా ఆఖరి రోజు నామినేషన్ వేసి దోమలపెంట ( బ్రహ్మగిరి ) మాజీ ఉప సర్పంచ్ కటకం మహేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ రిటర్న్ అధికారులు అయిన తిరుపతయ్య, శివ శంకర్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. తనకు పదవి ముఖ్యం కాదని గ్రామ సంక్షేమమే ముఖ్యమని పదవి ఉన్నా లేకున్నా గ్రామ సేవకురాలినై ఉంటానని చెప్పారు




