హనుమాన్ శోభాభయాత్రలలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రతినిధి నమస్తే ఇందూర్ ఏప్రిల్ 2
జహీరాబాద్ హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో జరిగిన పలు హనుమాన్ ఊరేగింపు మహోత్సవాల్లో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సందర్భగా ఎమ్మెల్యే గారు,చైర్మన్ మాట్లాడుతూ శ్రీ హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక. హనుమాన్ జయంతి అంటే మనసుకు, శరీరానికి శక్తి, ధైర్యం, నిబద్ధతను ఇచ్చే పర్వదినం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణానికి ఆంజనేయుడే నిదర్శనం. హనుమాన్ జయంతిని అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అని అన్నారు.
అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే కార్యసాధకుడు.భయాలను పోగొట్టి ధైర్యాన్ని నింపే అభయాంజనేయుడు.ఆ వాయుపుత్రుని ఆశీస్సులతో ప్రజలందరికీ విజయం, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి వైస్ ఛైర్మన్ అశోక్ శేరి, కౌన్సిలర్ మహిపాల్, నాయకులు విశ్వేశ్వర్, చిన్న రెడ్డి, జగదీష్,రాథోడ్ భీమ్ రావు నాయక్,వెంకట్ సాగర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.