NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 11:02 am Posted by : NAMASTE INDUR

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దళిత జర్నలిస్టులు అరెస్ట్..

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దళిత జర్నలిస్టులు అరెస్ట్.

నమస్తే ఇందూర్, కామారెడ్డి జూన్ 29

.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ .అండ్. పి .ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళుతున్న కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెడ్డు సాయిలు మాట్లాడుతూ జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ .అండ్.పి.ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరాక ముందే ఇండ్లలోకి వచ్చి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అనేది హేయమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల యొక్క హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడుతామని తెలిపారు.