NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 5:06 pm Posted by : MEDUDHULA KASHAGOUD

అనుమతి లేకుండా మద్యం సేవకు అవకాశం కల్పిస్తున్న హోటళ్ల మెస్‌లపై ఎక్సైజ్ శాఖ దాడులు

-లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు నమోదు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి
జూలై 18:

కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, మద్యం సేవకు అవకాశం కల్పిస్తున్న హోటళ్లు, మెస్‌లు, దాబాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.విశ్వసనీయ సమాచారం మేరకు డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్ పై దాడి నిర్వహించగా, అక్కడ అనుమతి లేకుండా మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తూ మెస్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మెస్ నిర్వాహకుడు లింబయోల దిలీప్ రెడ్డిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, మెస్‌లు, దాబాలు తదితర ప్రదేశాల్లో అనుమతి లేకుండా మద్యం విక్రయించడం లేదా మద్యం సేవించేందుకు అవకాశం కల్పించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అలాంటి కార్యకలాపాలు గుర్తించినట్లయితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అనుమతి లేకుండా మద్యం విక్రయాలు లేదా మద్యం సేవకు అవకాశం కల్పిస్తున్న ప్రదేశాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ఎస్సై విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్, కానిస్టేబుళ్లు రాజు, దినేష్ పాల్గొన్నారు.