అమ్మ మృతి తట్టుకోలేక కూతురు మృతి..

-తాడ్వాయి మండలం చిట్యాలలో హృదయ విదారక ఘటన (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి జులై 16: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో తల్లి మరణాన్ని తట్టుకోలేక కూతురు గుండెపోటుతో మృతి చెందిన హృదయ విదారక ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఒకే రోజు, కొన్ని నిమిషాల వ్యవధిలో తల్లి, కూతురు ఇద్దరూ కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మంగలి నర్సవ్వ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని...