ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకుని వ్యక్తి ప్రాణాలను కాపాడిన కామారెడ్డి పోలీసులు
-డయల్-100 సమాచారంతో 10 నిమిషాల్లో రైల్వే ట్రాక్‌పై గుర్తించి సురక్షితంగా రక్షణ -వేగవంతమైన స్పందనతో మరో కుటుంబంలో విషాదాన్ని నివారించిన పోలీసు సిబ్బంది (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 20: కామారెడ్డి జిల్లా పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందన కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు సురక్షితంగా కాపాడబడ్డాయి. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు కేవలం పది నిమిషాల వ్యవధిలో గుర్తించి రక్షించడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే, కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి...