NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 1:21 pm Posted by : MEDUDHULA KASHAGOUD

ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి, జూలై 04:

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో రైతు కాటిపల్లి రామ్‌మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 885 మంది రైతులు 2,533 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 1,300 ఎకరాల లక్ష్యం ఉండగా ఇప్పటికే 1,000 ఎకరాలకు రైతులను గుర్తించినట్లు చెప్పారు.జిల్లాలో ఇప్పటివరకు 180 ఎకరాల్లో కోత పూర్తై 76 మెట్రిక్ టన్నుల దిగుబడి లభించగా, రైతులు రూ.18 లక్షలకు పైగా ఆదాయం పొందినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలను వినియోగించుకొని మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి, ఉద్యానవన శాఖ అధికారులు, హెచ్‌యూఎల్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.