ఆర్.ఎం.పి & పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి డివిజన్ జిల్లా అధ్యక్షుడిగా షేక్ అజీజ్ ఎన్నిక

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 18: కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన ఆర్.ఎం.పి & పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశంలో కామారెడ్డి డివిజన్ జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ పి.ఎం.పి వైద్యులు షేక్ అజీజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వర్ రావు సమక్షంలో, కామారెడ్డి జిల్లా ఆర్.ఎం.పి& పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు నిజ్జన విఠల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి...