శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహంతో ఆలయ వైభవం మరింత పెరగాలి – ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు
05-07-26
భద్రాచలం నియోజకవర్గం.
భద్రాచలం, శిల్పినగర్ ఏరియాలో శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ పూర్వక కళావాహన కార్యక్రమాలు, యాగం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, ఆలయాల జీర్ణోద్ధరణ, సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భద్రాచలం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.