ఏరియా ఆసుపత్రి ఆవరణలో నిలిచిన వర్షపు నీరు.. రోగులకు ఇబ్బందులు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా  బాన్సువాడ జూలై 04 : బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన స్వల్ప వర్షానికే ఆసుపత్రి ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు బురదమయంగా మారింది. దీంతో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు.ఆసుపత్రి ప్రధాన మార్గాలు, వార్డుల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో రోగులు జారిపడే ప్రమాదం...