కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు..
-160 మంది పోలీసుల పాల్గొనికతో రాజీవ్‌నగర్, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో విస్తృత తనిఖీలు -121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు, తల్వార్, మద్యం బాటిళ్లు స్వాధీనం (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 04: ప్రజలకు మరింత చేరువ కావడం, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పరిసరాల్లో ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల...