NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:22 am Posted by : MEDUDHULA KASHAGOUD

కామారెడ్డిలో అత్యాధునిక సాంకేతికతతో ‘వీ నో డెంటల్ క్లినిక్’ ప్రారంభం

-ఇన్‌ట్రా ఓరల్ స్కానర్‌తో ఖచ్చితమైన దంత పరీక్షలు

– అన్ని రకాల దంత వైద్య సేవలు ఒకేచోట

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 23:

జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో, స్పర్శ స్కిన్ హాస్పిటల్ ఎదురుగా అత్యాధునిక సౌకర్యాలతో ‘వీ నో డెంటల్ క్లినిక్’ ప్రారంభమైంది. ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన దంత వైద్య నిపుణుల సేవలతో ఈ క్లినిక్ జిల్లా ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలను అందించనుంది.ఈ క్లినిక్‌లో ప్రముఖ దంత వైద్య నిపుణుడు డా. ప్రణీత్ రామ్ సేవలందించనున్నారు. హైదరాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో దంత వైద్యుడిగా విశేష అనుభవం సంపాదించిన ఆయన, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కామారెడ్డి ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను ప్రారంభించారు.క్లినిక్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌ట్రా ఓరల్ స్కానర్ ద్వారా నోటి లోపలి భాగాన్ని 360 డిగ్రీల డిజిటల్ స్కానింగ్ చేసి, దంతాలు, చిగుళ్లు మరియు ఇతర నోటి సంబంధిత సమస్యలను అత్యంత ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని డా. ప్రణీత్ రామ్ తెలిపారు. ఈ సాంకేతికతతో రోగులకు వారి సమస్యపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు, మరింత సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు.
ఈ క్లినిక్‌లో రూట్ కెనాల్ చికిత్స, దంతాల శుభ్రపరచడం (స్కేలింగ్), పళ్లు తొలగించడం, కృత్రిమ పళ్లు, క్యాప్స్, బ్రిడ్జ్‌లు, డెంటల్ ఇంప్లాంట్స్, కాస్మెటిక్ డెంటిస్ట్రీతో పాటు అన్ని రకాల దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పలువురు వైద్యులు డా. ప్రణీత్ రామ్‌ను అభినందిస్తూ, ఆధునిక పరికరాలతో కామారెడ్డి ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. జిల్లా ప్రజలకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.