కామారెడ్డి కోర్టులో తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రం ప్రారంభం

-ఎస్.ఐ.ఆర్. దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదుకు ప్రత్యేక ఏర్పాట్లు -ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ప్రధాన జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిద (నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్, జూలై 21: ప్రజలు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్.ఐ.ఆర్.) సంబంధిత దరఖాస్తులను సులభంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని మంగళవారం ప్రధాన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి పి. ముక్తిద ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ దరఖాస్తుల...