NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 11:31 am Posted by : MEDUDHULA KASHAGOUD

కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు

-జిల్లా సగటు 47.7 మి.మీ. నమోదు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 31:

కామారెడ్డి జిల్లాలో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన మండలాల వారీ వర్షపాతం వివరాల ప్రకారం జిల్లా సగటున 47.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 6.7 మిల్లీమీటర్లు ఉండగా, 612 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా నస్రుల్లాబాద్ మండలంలో 89.3 మి.మీ., బీర్కూర్‌లో 76.8 మి.మీ., గాంధారిలో 72.5 మి.మీ., బాన్సువాడలో 67.3 మి.మీ., తాడ్వాయిలో 62.4 మి.మీ. వర్షం కురిసింది. అలాగే కామారెడ్డి, భిక్కనూర్, మొహమ్మద్‌నగర్ మండలాల్లో కూడా 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.జిల్లాలో మొత్తం 12 మండలాలు ‘ఎక్సెస్’, 12 మండలాలు ‘నార్మల్’, ఒక మండలం ‘లార్జ్ ఎక్సెస్’ వర్షపాతం కేటగిరీలో ఉండగా, ఏ మండలం కూడా డెఫిసిట్ లేదా లార్జ్ డెఫిసిట్ కేటగిరీలో లేదు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు ఈ వర్షాలు వరి, ఇతర ఖరీఫ్ పంటలకు ప్రయోజనకరంగా మారనున్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.