కామారెడ్డి జిల్లా గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 04: కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. రఘు తెలిపారు.జిల్లాలోని భిక్కనూర్ గురుకులం–1, ఉప్పల్వాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సి ఓ ఈ) కాలేజీ–2, ఎల్లారెడ్డి గురుకులం–3, అచ్చంపేట గురుకులం–4లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నాలుగు గురుకులాలకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్లు ఒకే కేంద్రంలో నిర్వహించబడతాయని, ఇతర జిల్లాలకు చెందిన...