కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు..
-కమిషనర్, అకౌంటెంట్‌పై విచారణ కోరిన కౌన్సిలర్లు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 16: కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కొంతమంది అధికారులు కమిషన్లు తీసుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలను ఫిర్యాదులో ప్రస్తావించారు. 1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ కౌన్సిలర్ తాటి లావణ్య ప్రసాద్, 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత సంయుక్తంగా ఈ ఫిర్యాదును రాష్ట్ర,...