(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జులై 23:
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు.. గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 2,000 ఈత మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ఈత చెట్ల పెంపకం ద్వారా గౌడ కులస్తులకు వారి కులవృత్తికి ఉపాధి కలగడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో ఈత, ఖర్జూర మొక్కలను విస్తృతంగా నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దివ్య, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్, గౌడ సంఘం ప్రతినిధులు మొగుళ్ళ సాయగౌడ్, పెద్ద రాజా గౌడ్, మొగుళ్ళ రామాగౌడ్, ఇతర గౌడ కులస్తులు అలాగే ఎక్సైజ్ సిబ్బంది నరసింహులు, శరత్‌చంద్ర, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.