గర్గుల్‌లో వన మహోత్సవం.2,000 ఈత మొక్కల పెంపు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జులై 23: కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు.. గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 2,000 ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ఈత చెట్ల పెంపకం ద్వారా గౌడ కులస్తులకు వారి కులవృత్తికి ఉపాధి కలగడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా...