గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 30: గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలోని తన నివాసంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గర్భధారణ సమయంలో మహిళలకు పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గర్భిణీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తల్లి, బిడ్డ...