చిన్నమల్లారెడ్డిలో వనమహోత్సవం.. ఈతమొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ అధికారులు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి రూరల్ జూలై 21: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈతమొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఈతమొక్కలు నాటారు.అధికారులు తెలిపిన ముఖ్యంశాలు.. పచ్చదనాన్ని పెంపొందించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవాన్ని...