జూదంపై పోలీసుల ఉక్కుపాదం ఐదుగురు పట్టివేత..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఎల్లారెడ్డి, జూలై 05: జూదం నిర్వహిస్తున్న వారిపై ఎల్లారెడ్డి పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21,350 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా జూదం (గేమింగ్) ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు....