జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 03:విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత,...