NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 3:51 pm Posted by : Rayala Polaiah

జూలై 7న ప్రతి గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఎగరాలి

జులై 7 న ప్రతి గ్రామంలోఎమ్మార్పీఎస్ జెండా రెపరెపలాడాలి,

నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలై 6

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

దమ్మపేట మండలం,ముష్టి బండ గ్రామం,

ఎమ్మార్పీఎస్ 32 వ ఆవిర్భావ దినోత్సవాన్ని *ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ*

మంద కృష్ణ మాదిగ పిలుపు

మేరకు అశ్వారావుపేట నియోజకవర్గo లోని

అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించాలని, అశ్వారావుపేట నియోజకవర్గం ఇంచార్జి MRPS స్టేట్ సెక్రటరీ కొలికపోగు కాంతారావు మాదిగ  కోరారు.అలాగే మంద కృష్ణ అన్న మాదిగ పుట్టిన రోజు వేడుకలు గ్రామ గ్రామం గణం గా జరగాలని కోరారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమం స్థాపించి 32 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రెండు సంవత్సరాల నుండి వర్గీకరణ ఫలితాలు అందుతున్న క్రమంలో గ్రామాల్లో ప్రతిఒక్కరికి తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జండాఆవిష్కరణ చేయాలని కోరారు,

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దమ్మపేట మండల ఇంచార్జి MRPS తెలంగాణ స్టేట్ సెక్రటరీ కొలికపోగు కాంతారావు మాదిగ గారు మాట్లాడుతూ వర్గీకరణ జరగటం వలన రాష్ట్రంలో మాదిగల ఉద్యోగుల శాతం పెరిగింది కావున ప్రతి ఒక్కరు బాధ్యతగా ఆవిర్భావ దినోత్సవం జరిపించాలని కోరారు,

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ కొలికపోగు కాంతారావు మాదిగ,రవి మాదిగ,ముసలయ్య మాదిగ అశోక్ మాదిగ,పుల్లారావు మాదిగ,వీరయ్య మాదిగ ,పోలయ్య మాదిగ,పాల్గొన్నారు,,,