టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నుల పంపిణీ
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద జూలై 23: తెలంగాణ జర్నలిస్టుల సంఘం ( టి.జె.ఏ.) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో గురువారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, స్కెచ్ పెన్నులను పంపిణీ చేశారు.కార్యక్రమానికి హాజరైన టి.జె.ఏ. నాయకులు ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేస్తూ, విద్యే జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.సామాజిక బాధ్యతలో భాగంగా...