Date of Publish : 07 July 2026, 2:41 pmPosted by : Rayala Polaiah
డయా గ్రేసిస్టు నిర్వాహకుడకు జైలు శిక్ష
డయాగ్నెసిచ్ సెంటర్ నిర్వాహకుడుకు జైలు శిక్ష:
నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం లీగల్:: డయాగ్నసిస్ సెంటర్ నిర్వాహకుడికి మూడు సంవత్సరాలలో జైలు 10,000/- రూపాయల జరిమాన విధిస్తూ దమ్మపేట జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ బి. భవాని తీర్పు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీమతి జి అశ్విని అశ్వారావుపేట పెద్దిరాజు నిర్వహించే సాగర్ డ్రగ్స్ సెంటర్ పై 2015 మే పదకొండు న ఇన్స్పెక్షన్ చేయగా లైసెన్సు లేకుండా బ్లెడ్ షాంపిల్ తీస్తున్నారు అది డ్రగ్స్ చట్ట ప్రకారం నేరం అని కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు.కోర్టులో నల్గుగురు సాక్షులను విచారించారు. మార్త పెద్దిరాజు పై నేరములు రుజువు అయినది.మూడు సంవత్సరముల జైలు శిక్ష, రు. 10,000/-జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసెక్యూషన్ ను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్. శ్రీధర్ నిర్వహించారు.