NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 2:39 pm Posted by : MEDUDHULA KASHAGOUD

డైరీ టెక్నాలజీ కళాశాలను సందర్శించిన కౌన్సిలర్ హర్షిత..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 04:

కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న డైరీ టెక్నాలజీ కళాశాలను స్థానిక వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత సందర్శించారు. ఈ సందర్భంగా దొడ్ల డైరీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కళాశాల మొదటి అంతస్తు భవన నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం కళాశాలలోని ఇంజనీరింగ్ విభాగం, డైరీ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి విద్యాభ్యాసం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డిలో ఉండటం గర్వకారణమని కౌన్సిలర్ హర్షిత పేర్కొన్నారు. డైరీ టెక్నాలజీ కోర్సుల ద్వారా దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆమె అన్నారు. కళాశాల మరింత అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి పీజీ డైరీ టెక్నాలజీ కోర్సు ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కళాశాల అభ్యాసక బృందం కౌన్సిలర్ హర్షితను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సురేష్ రాథోడ్, అధ్యాపకులు ఉమాపతి, డాక్టర్ స్వర్ణలత, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.